స్టార్ హీరో తనయుడికి ఐదు గోల్డ్ మెడల్స్…

Madhavan's son Vedaant wins 5 gold medals for country
Madhavan's son Vedaant wins 5 gold medals for country

దాదాపు ఏడు భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కొందరి హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ కూడా ఒకరు. మాధవన్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేయటం వల్ల ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. మాధవన్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా రాణించాడు.

మాధవన్ తనయుడు వేదాంత్ చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలు గెలుస్తున్నాడు. గతేడాది కొన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలవడంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు వేదాంత్. ఇప్పుడు వేదాంత్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటారు. మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంఫియన్ షిప్ 2023లో పాల్గొన్నాడు. ఈ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న వేదాంత్ ఏకంగా ఇండియాకు 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 50,100, 200, 400, 1500 మీటర్లల కేటగిరీల్లో ఐదు గోల్డ్ మెడల్స్ సాధించారు. మాధవన్ ఈ విషయాన్ని తన ఇన్‍‍స్టాలో వెల్లడించారు. ’ దేవుడు దయ, మీ ఆశిస్సులతో వేదాంత్ ఐదు గోల్డ్ మెడల్స్ సాధించాడు. రెండు పర్సనల్ బెస్ట్ రికార్డులు నమోదు చేశాడు, అని పేర్కొన్నారు.