Sunday, April 28, 2024
- Advertisement -

కొలిక్కి వచ్చేలా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు..?

- Advertisement -

ఏపీలో 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పెను సంచలనంగా మారిన సంగతి విధితమే. ఈ హత్య జరిగి నాలుగేళ్ల పూర్తి కావొస్తున్న ఇంతవరకు ప్రధాన నిందితులెవరనేది మిస్టరీగానే ఉంది. మొదటి సిట్ అధికారుల నుంచి ఇప్పుడు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ వరకు.. అధికారులు మారుతున్నప్పటికి కేసు మాత్రం ముందుకు కదలడం లేదు. వివేకా హత్య చుట్టూ ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయని, పక్క పథకం ప్రకారమే వివేకా హత్య జరిగిందని మొదటి నుంచి ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. హత్య జరిగే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలో ఉన్నారు.

అంతే కాకుండా ఏపీ పోలీసులు నిందితులు కుమ్మకయ్యారని అందుకే దర్యాప్తు ముందుకు సాగడం లేదని కూడా స్పష్టం చేసింది సీబీఐ దాంతో ఈ కేసు విషయమై దర్యాప్తు ను పక్క రాష్ట్రనికి బదలి చేయాలని వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు కూడా ఆమె వినతికి అంగీకారం తెలపడంతో మరొకసారి వివేకా హత్యకేసు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు హైదారాబాద్ కు మారింది. ఈ కేసులో విచారణను హైదరాబాద్ సీబీఐ వెగవంతంచేసింది.

ఇది ఇలా ఉంటే రోజుకో మలుపు తిరుగుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని నిన్న అరెస్టు చేసింది. అంతకు ముందు శుక్రవారం అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్‌ను అరెస్టు చెయ్యడం.. ఇవాళ మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డిని తమ ముందు హాజరు కావాలని సమన్లు పంపించింది… చూస్తుంటే ఈ కేసు కొలిక్కి వచ్చేలా ఉన్నట్లుంది. త్వరలోనే ఈ కేసు సాల్వ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో సంచలనంగా మారిన తన బాబాయ్ వివేకా హత్యకేసు. పట్ల.. ఎన్నికల ముందు హడావిడి చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక సైలెంట్ గా ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -