Thursday, May 9, 2024
- Advertisement -

టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి కేసునుంచి బిగ్ రిలీఫ్…

- Advertisement -

టీమిండియా ఫేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గృహ హింస కేసులో కోర్టునుంచి బిగ్ రిలీఫ్ లభించింది.గత ఏడాది షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై గృహ హింస కేసు కేసు పెట్టింది. ఈ కేసులో న్యాయస్థానానికి షమీ హాజరు కాకపోవడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.విండీస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన 15 రోజుల్లోపు లొంగిపోవాలంటూ కోర్టు షమీని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో షమికి ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ పై స్టే విధించింది.న్యాయస్థానం రెండు నెలల పాటు స్టే విధించిందని షమి తరుపు న్యాయవాది సలీం రెహ్మాన్ తెలిపారు.తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుందని లాయర్ తెలిపారు.

ఇండియా తరపున షమీ 70 వన్డేలు, 42 టెస్టులు, 7 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 153, వన్డేల్లో 131,టీ20 ల్లో ఎనిమిది వెకెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -