Tuesday, May 7, 2024
- Advertisement -

20వ సారి గర్భం ధరించిన మహిళ….షాక్ తిన్న డాక్టర్లు

- Advertisement -

నాలుగు రోజుల కిందట 74 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో ఓ మహిళ కవలలకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పంది. అయితే దానిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 20వ సారి గర్భం దాల్చి వార్తల్లోకి ఎక్కింది.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 38ఏళ్ల మహిళ ఇటీవల ఏడు నెలల గర్భంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది.ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె 20వ సారి గర్భం దాల్చినట్టు తెలుసుకుని షాక్ తిన్నారు. మొత్తం 20సార్లు గర్భం దాల్చగా.. 16సార్లు బిడ్డలకు జన్మనిచ్చిందని.. 3 సార్లు మాత్రం అబార్షన్ అయిందని ఇప్పుడు మరో సారి గర్భంతో ఉందని చెప్పారు.

ఐదుసార్లు మాత్రం పుట్టిన పిల్లలు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందారు. ప్రస్తుతం ఆమెకు 11 మంది పిల్లలున్నారు. లంకాబాయి విషయం తెలిసిన బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ థొరాట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉందని, తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక హాస్పిటల్‌లో చేరాలని సూచించినట్టు వివరించారు. రోజువారీ పనులు, ఉపాధి కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వలసవెళ్తుంటారు. ఇన్నిసార్లు గర్భం ధరించడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -