Friday, March 29, 2024
- Advertisement -

తాను గ‌ర్భ‌వ‌తిని అయ్యానంటున్న టెన్నిస్ స్టార్‌..!

- Advertisement -

ఈ మ‌ధ్య టెన్నిస్ క్రీడాకారులు వ‌రుస‌గా శుభ‌వార్త‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు టెన్నిస్ క్రీడాకారిణిలు మేం గ‌ర్భ‌వ‌తులం అంటు షాక్ ఇచ్చారు.ఇండియ‌న్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా గ‌ర్భ‌వ‌తి అయిన సంగ‌తి తెలిసిందే.ఇక త‌న ఆట‌తో ప్ర‌పంచం మొత్తం అభిమానుల‌ను సంపాదించిన అమెరికా టెన్నిస్ క్రీడాకారిణీ సెరినా విలియ‌మ్స్ కూడా ఇటీవ‌లే ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే.తాజాగా మ‌రో టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్ తాను గర్భవతిని అంటూ ప్రకటించింది.

వచ్చే పుట్టినరోజుకల్లా మా కుటుంబం ముగ్గురు సభ్యులతో ఉంటుందని తెలిపింది. హరాల్డ్ లీమన్ అనే మాజీ స్పోర్ట్స్ ఫిజీషియన్ ను హింగిస్ పెళ్లాడింది.మా కుటుంబం ముగ్గురికి పెరుగుతోందని ఎంతో ఎగ్జైటింగ్ గా చెబుతున్నా’ అంటూ ట్వీట్ చేసింది.హింగిస్ తన కెరీర్లో ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది. 209 వారాల పాటు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో కొనసాగింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -