రోహిత్ గాయం కారణంగానే భారతకి ఓటమి : న్యూజిలాండ్ పేసర్

న్యూజిలాండ్ గడ్డపై భారత దారుణ ఓటమికి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయమే కారణమని కివీస్ వెటరన్ పేసర్ మిచెల్‌ మెక్‌ క్లెనఘన్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా కారణంగా ఇప్పుడు అన్ని టోర్నీలు రద్దయ్యాయి. దీంతో ఐపీఎల్ ఆడాల్సిన విదేశీ ఆటగాళ్లు నిరాశకు లోనవుతున్నారు. ఇక న్యూజిలాండ్‌కి చెందిన మిచెల్ మెక్ క్లనఘన్ ఇటీవల పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌లో ఆడి స్వదేశానికి వెళ్లాడు.

అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అన్ని దేశాల ప్రభుత్వాలు.. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు స్వియ నిర్భంధంలో ఉండాలని ఆదేశించాయి. దీంతో.. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో మిచెల్ మెక్ క్లనఘన్ ఉన్నాడు. ఇక ఇంటికే పరిమితమైన ఈ ముంబై ఇండియన్స్ పేసర్ శనివారం తన ట్విటర్ అకౌంట్‌లో #AskMitch session నిర్వహించాడు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికరప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.

న్యూజిలాండ్ గడ్డపై భారత ఓటమికి రోహిత్ శర్మ అని ఓ భారత అభిమాని లేకపోవడమే కారణమా? ప్రశ్నించాడు. దీనికి మెక్ క్లెనఘన్ కూడా అవుననే సమాధానమిచ్చాడు. మరో యూజర్ రోహిత్‌లో స్పూర్తినిచ్చే అంశం ఏంటని అడగ్గా.. అతనో గొప్పనాయకుడని బదులిచ్చాడు. రోహిత్, మిచెల్ చాలా కాలంగా ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబై చాంపియన్‌గా నిలిచిన 2015,17,19 సీజన్ల‌లో మెక్ క్లనఘన్ రాణించాడు. ఇక ధోనీ గురించి కొన్ని విషయాలు చెప్పండని ఓ అభిమాని ప్రశ్నించగా.. అతనికి బౌలింగ్ చేయకూడదు బాబోయ్..! అని సమాధానమిచ్చాడు.