- Advertisement -

ఏడిపించిన అనసూయ.. ఏమైందంటే ?

- Advertisement -

కరోనా కారణంగా ఎవరు బయటకు రావడం లేదు. అందుకే అందరు టీవీలకు, యూట్యూబ్ లకు అతుక్కుపోయారు. పలు ఛానల్స్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి.. ఈటీవీలో ‘పండగ సార్ పండగ అంతే’ అంటూ రోజా నాయకత్వంలో 30కి పైగా కమెడియన్లు, జడ్జిలు, డాన్స్ మాస్టర్స్ రెడీ అవుతుంటే.. జీ తెలుగులో నాగబాబు గారి నాయకత్వంలో ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ అంటూ ప్రోమోలతో పోటాపోటీగా సందడి చేస్తున్నారు.

బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం లో అనసూయ అదిరిపోయే ఫర్మామెన్స్ ఇచ్చింది. యూట్యూబ్‌‌లో ఇందుకు సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. ఒక ప్రోమోలో మెగా డాటర్ నిహారిక ర్యాప్ సాంగ్ పాడుతూ తనలోని మల్టీటాలెంట్‌ను బయటపెట్టింది. అలవైకుంఠపురములో చిత్రంలోని ‘ఓమైడాడీ’ సాంగ్ పాడి.. తన తండ్రి నాగబాబు చిన్ననాటి కోరికను నెరవేర్చింది నిహారిక. యాంకర్ అనసూయ.. మహానటి సావిత్రి అవతారం ఎత్తి సర్ ప్రైజ్ ఇచ్చింది. అనసూయ నట విశ్వరూపాన్ని చూపించింది. సావిత్రిగా నటించించి.

సినిమాలో ఏ రకంగా సాగిందో అచ్చం అలానే అనసూయ చేసింది. ఆమె మద్యానికి బానిసై పిచ్చిదానిలా కావడంతో లాంటి సన్నివేశాల్లో ఇటీవల సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్‌ను డామినేట్ చేసే ప్రయత్నం చేసింది అనసూయ. కీర్తి సురేష్ ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తుంటే.. అనసూయ చేసే ఈ సీన్లు కామెడీగా అనిపించాయి. సావిత్రిలా నటించాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటిది ఆమెనే డామినేట్ చేయాలనుకుందో ఏమో కాని.. అనసూయను సావిత్రిగా చూడటం ప్రేక్షకులకు కష్టంగానే అనిపించింది.

ఆమె మందుకొట్టే సీన్లు.. జెమిని గణేషణ్ వేరే మహిళతో ఉన్నప్పుడు ఆమె కంట పడిన సీన్.. గణేషన్‌కి దూరమైన తరువా ఏడ్చే సీన్లలో ‘మహానటి’ని ఇమిటేట్ చేయడానికి చాలానే కష్టపడింది అనసూయ. ఆమె ఫెర్పామెన్స్ కి కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు తిడుతున్నారు. బాబు గారి ఇంట్లో బుట్ట భోజనంకి అతిథులు చాలా మందే ఉన్నారు. అనుష్క క్యూట్ గా కనిపించింది. తరుణ్ మాస్టర్, జానీ మాస్టర్, రషు మాస్టర్, యాంకర్ రవి, ప్రదీప్, భాను శ్రీ, మెగా డాటర్ నిహారిక, చమ్మక్ చంద్ర ఇలా రెండు మూడు డజన్లకు పైగా సెలబ్రిటీలు కమెడియన్స్ సందడితో ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ సాగింది. ఇక మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.

https://youtu.be/HCnad22hP2U

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -