- Advertisement -
పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియాకు షాకిచ్చాడు ఆసీస్ బౌలర్ స్టార్క్. రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది టీమిండియా.ఓపెనర్ మురళీ విజయ్ పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. 12 బంతులను ఎదుర్కొన్న విజయ్.. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆఖరి బంతికి బౌల్డ్ అయ్యాడు.
ఇక ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆటలో మాత్రం చతికిలపడింది.. 277/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం ఆటను ప్రారంభించిన ఆసీస్..మరో 49 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి ఆరు పరుగులు చేసింది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’