Tuesday, May 14, 2024
- Advertisement -

హర్భజన్ ని అటాక్ చేసిన ధోనీ ఫాన్స్…

- Advertisement -

భారత దేశం లో క్రికెట్ అంటే ఒక వింత మతం లాంటిది. ఏ మతం వారు అయినా ఇందులో సభ్యులే అందరూ ఇందులో ఆట ని ప్రేమిస్తూనే ఉంటారు. ఈ అభిమానం ఇప్పటిది కాదు మన తాతల కాలం నుంచీ క్రికెట్ మీద ఉన్న ఇష్టం ఇలా పెరుగుతూ వచ్చింది.

అప్పుడప్పుడు ఈ అభిమానం పొలిమేరలు దాటి దురభిమానంగా కూడా మారుతూ ఉంటుంది. తమకి ఇష్టమైన స్టార్ బ్యాట్స్ మెన్ మీద , బౌలర్ మీదా ,ప్లేయర్ మీదా  ఏదైనా అపవాదు పడితే ఫాన్స్ తట్టుకోలేక పోతున్నారు. అదివరకు ఇలాంటి సందర్భాలో మైదానం వరకూ ఇబ్బందులు తలెత్తేవి. ఇష్టం వచ్చినట్టు మైదానం లో అన్నీ విసిరేయడం మంటలు రేపడం లాంటివి చేసేవారు అభిమానులు కానీ ప్రస్తుత కాలం లో అది ఇంకా ఇంకా శృతి మించుతోంది అంటున్నారు.

నిన్నటికి నిన్న టీం ఇండియా అప్పట్లో కెప్టెన్ గా చేసిన సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు కాగా హర్భజన్ సింగ్ ఆయన్ని విష్ చెయ్యడం ఇప్పుడు న్యూస్ అయ్యింది. అయితే నిన్న టీమిండియా కెప్టెన్ గా తనదైన శైలిలో రాణించి ప్రశంసలు అందుకున్న సౌరవ్ గంగూలి జన్మదినాన్ని పురస్కరించుకుని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడిని టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ గా అభివర్ణించాడు. దీనిపై కెప్టెన్ కూల్… కూల్ గానే ఉన్నా అతడి అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోయారు.

సహనం ఉన్న కొందరు భజ్జీ కామెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు సంధిస్తే… మరి కొందరు మాత్రం భజ్జీ కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో భజ్జీ ఇదెక్కడి గొడవరా నాయనా అనుకుంటూ తలపట్టుకున్నాడట. క్రికెట్ పరిశీలకులు మాత్రం గంగూలీ – ధోనీలు ఇద్దరూ గొప్పోళ్లే కానీ అభిమానులే గొప్పగా ఉండడం లేదంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -