- Advertisement -

జాకీర్ ని పీకి పడేసారు

- Advertisement -

వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక కి చెందిన పీస్ టీవీ ప్రసారాలు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దుబాయ్ నుంచి టెలీకాస్ట్ అయ్యే జాకీర్ టీవీ అనే ఛానల్ మీద ఇప్పటికే నిషేధం విధించబడి ఉంది.

కొందరు కేబుల్ ఆపరేటర్ లు కావాలని దీన్ని ప్రసారం చేస్తూండగా ఇప్పుడు తాజాగా అది కూడా తొలగించేసారు. దేశ వ్యాప్తంగా టెలీకాస్ట్ అయ్యే చానల్స్ లో దాదాపు 24 అక్రమంగా ఉండగా అందులలో 11 పాకిస్తాన్ ఛానళ్ళు . జాకీర్ నాయక్ ఇచ్చిన ప్రసంగాలని స్పూర్తిగా తేసుకున్న కొందరు యువకులు బంగ్లాదేశ్ లో ఉగ్ర దాడులకి పాల్పడ్డారు అని తెలియడం తో ఆయన మీద కేంద్ర ప్రభుత్వం పూర్తి నిఘా పెట్టి ఇది వరకు ఆయన మాట్లాడిన మాటలు , ఆయన ప్రసంగాలూ అన్నీ సీడీ లో తెప్పించుకుని మరీ వీక్షిస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమం లో పీస్ టీవీ సంగతి బయటపడింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయన ప్రసంగాలపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ క్రమంలో జకీర్ కు చెందిన పీస్ టీవీకి ఎటువంటి లైసెన్సూ లేదని గుర్తించారు. కేబుల్ నెట్ వర్క్ ద్వారా అక్రమంగా ప్రసారమవుతున్న ఆ చానల్ ను కేంద్రం నియంత్రించింది. ఆన్ లైన్ తో పాటు యూట్యూబ్ లో ఉన్న జకీర్ నాయక్ వివాదస్పద ప్రసంగాలను తొలగించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. మరొక పక్క మహార్రాష్ట ప్రభుత్వం జకీర్ ట్రస్ట్ కార్యకలాపాలు – విరాళాలపై దర్యాప్తు జరుపుతోంది. ప్రస్తుతం మక్కాలో ఉన్న జకీర్ నాయక్ తనపై వస్తున్న ఆరోపణలపై వాట్సాప్ ద్వారా స్పందించారు. బంగ్లాదేశ్ ఉగ్రదాడులకు – తన ప్రసంగాలకు ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -