Saturday, May 18, 2024
- Advertisement -

షాకింగ్ : ఒక అమ్మాయి కోసం దేవదాసు అయిపోయిన ధోనీ

- Advertisement -

తన హెలీకాప్టర్ షాట్ లతో బంతి ని మైదానం అవతల విసిర కొట్టే మహేంద్ర సింగ్ ధోనీ లో కూడా ఒక విషాద ప్రేమ విషయం ఉంది అంటే నమ్మలేం కదా ? కానీ ఉందండోయ్.అప్పట్లో మన ధోనీ బాబు కూడా దేవదాసు అయిన సందర్భం ఉందట. ఒక అమ్మాయి కి అడ్డంగా పడిపోయిన ధోనీ ఆమెనే తన జీవిత భాగస్వామి అనుకున్నాడు.

ఆమె తో ప్రేమ నడుపుతూ మరొక పక్క క్రికెట్ సాధన చేస్తూ ధోనీ అత్యున్నత శిఖరాలు ఎక్కడానికి సిద్దం అవుతూ ఉంటాడు. అనుకోని పరిస్థితి లో ఆమెకి జరిగిన ప్రమాదం తో ఇరవై సంవత్సరాల వయసులో ప్రియాంక (ఆమె పేరు ) కి దూరం అవుతాడు ధోనీ. తరవాత రాంచి లో ఉండలేక టీం ఇండియా నుంచి పిలుపుకోసం ఎదురు చూసి అక్కడికి వెళ్లి క్రికెట్ లో విధ్వంసకర బ్యాట్స్మన్ గా ఎదిగాడు.

నెమ్మదిగా తన ప్రియురాలి జ్ఞాపకాల నుంచి బయట పడిన ధోని తన చిన్న నాటి స్నేహితురాలు సాక్షి ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన వ్యక్తి గత విషయాలను మీడియా తో పంచుకోని ధోని తొలి ప్రేమ బయటకు రావడానికి కారణం ఓ సినిమా. నీరజ్ పాండే దర్శకత్వం లో ధోని జీవిత చరిత్ర ఆధారం గా రూపొందుతోన్న చిత్రం ‘ ఎం.ఎస్. ధోని- ది అన్ టోల్డ్ స్టోరీ’. ఈ చిత్ర బృందం ఈ వివరాలన్నీ సేకరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -