Thursday, May 2, 2024
- Advertisement -

విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికిన న్యూజిలాండ్ బ్యాట్స్ మ‌న్ మ‌న్రో..

- Advertisement -

New Zealand vs westindies t20 : Colin Munro welcomes 2018 in his own style

New Zealand , westindie, t20, Colin Munro

విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికిన న్యూజిలాండ్ బ్యాట్స్ మ‌న్ మ‌న్రో..

న్యూజిలాండ్ హిట్టర్ కొలిన్ మన్రో విధ్వంసం సృష్టించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీతో చెలరేగాడు. 23 బంతులను ఎదుర్కొన్న మన్రో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు పిండుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు మైదానం అంతా బౌండ‌రీలు వ‌ర్షం కురిపించారు. విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికారు మ‌న్రో. మన్రో చివరకు విలియమ్స్ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

మన్రో అవుటయ్యే సమయానికి న్యూజిలాండ్ 5.5 ఓవర్లలోనే 78/2 పరుగులు చేసింది. కానీ ఇన్నింగ్స్ ఏడు, 8వ ఓవర్లలో గ్లెన్ ఫిలిప్స్, టామ్ బ్రూస్ వికెట్లను వరుసగా కోల్పోయింది. 9 ఓవర్లలో 102/4తో నిలిచిన తరుణంలో వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

మన్రో రెండేళ్ల క్రితం 14 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కివీస్ తరఫున టీ20ల్లో ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా, ప్రస్తుతం చేసింది ఆ జట్టు తరఫున రెండో ఫాస్టెస్ట్. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫె సెంచరీ రికార్డు యువీ పేరిట ఉంది. అతడు 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -