Monday, April 29, 2024
- Advertisement -

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో ధావ‌న్‌, కోహ్లీ స్టెప్పులు

- Advertisement -

దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భారత క్రికెట్ ఆట‌గాళ్లు స్టెప్పులతో అదరగొట్టారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ద‌క్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో విహ‌రించారు. ఆదివారం ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో కలిసి కాసేపు వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఈ స‌మ‌యంలో ఓ చోట వేడుక‌లు జ‌రుగుతుండ‌గా కోహ్లీ, ధావ‌న్ స్టెప్పులు వేశారు. వాకా వాకా పాట‌కు ఇద్ద‌రూ హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఓ బ్యాండ్‌కు సంబంధించిన వారు పాటలతో హోరెత్తించగా అక్కడే ఉన్న కోహ్లీ-ధావన్‌ ఆ పాటలకు అనుగుణంగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. పర్యాటకులు సైతం వీరి డ్యాన్స్‌ చూస్తూ ఉండిపోయారు.

ఉల్ల‌ల్ల లేవో.. వాకా వాక పాట‌ల‌కు ధావన్‌, కోహ్లీ డ్యాన్స్ చేశారు. కాలి గాయంతో బాధపడుతున్న ధావన్‌ కోలుకున్నట్టు కనిపిస్తోంది. గాయం కారణంగా ధావన్‌ ఇప్పటికే తొలి టెస్టు నుంచి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ధావన్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత్‌ -దక్షిణాఫ్రికా మధ్య జనవరి 5వ తేదీన తొలి టెస్టు ప్రారంభంకానుంది.

https://www.instagram.com/p/BdWrwMmjdU2/

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -