Tuesday, May 14, 2024
- Advertisement -

నాగినీ డ్యాన్స్‌ను అద‌ర‌గొట్టిన స‌న్నీ….

- Advertisement -

నిదాహస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి సంగతి ఏమోగానీ.. గత మ్యాచ్‌లో వాళ్లు చేసిన నాగిని స్టెప్పులే వాళ్ల పాలిట ఇప్పుడు విలన్‌గా మారాయి. నాగిని డ్యాన్స్ క్రికెట్ అభిమానులను ఎంతగా అలరించిందో తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన బంగ్లా ప్లేయర్లను ట్రోలింగ్‌తో ఓ ఆటాడేసుకుంటున్నారు.

అయితే భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక అభిమానులు కసి తీర్చుకున్నారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు నాగిని డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. భారత బ్యాట్స్‌మెన్ సిక్స్ గానీ, ఫోర్ గానీ కొడితే చాలు శ్రీలంక అభిమానులు రెండు చేతులూ పైకిలేపి నాగిని డ్యాన్స్ చేసేశారు.

అయితే గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులే కాదు.. కామెంట్రీ బాక్సులో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా నాగిని డ్యాన్స్ చేశారు. టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గవాస్కర్ సీటులో నుంచి పైకి లేచి నాగిని డ్యాన్స్ చేశారు. సన్నీ నాగిని డ్యాన్స్‌ను మరో కామెంటేటర్, ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

వాస్తవానికి బ్రెట్ లీ కోరిక మేరకే సన్నీ నాగిని డ్యాన్స్ చేసినట్లు సమాచారం. ఇది తెలియని బంగ్లా అభిమానులు సన్నీ తమ జట్టును అవమానపరిచారంటూ మండిపడుతున్నారు. సన్నీ వీడియో సోషల్ వీడియోలో వైరల్ కావడంతో బంగ్లా అభిమానులు ఆయణ్ని తిట్టిపోస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ భారత అభిమానులు మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న వీడియోను మీరూ చూడండి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -