Tuesday, May 6, 2025
- Advertisement -

వార్న‌ర్‌, స్మిత్‌కు షాక్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా..

- Advertisement -

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ల‌కు క్రికెట్ ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఈనెల 28తో ఇద్ద‌రిపై ఉన్న నిషేధం పూర్త‌వుతుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన ఈ ఇద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. జాతీయ జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం చేయాల‌నుకున్న ఇద్ద‌రికి నిరాశె మిగిలింది. పాకిస్తాన్‌తో జరిగే 5 వన్డేల సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించింది. పాక్ సిరీస్‌తో ఇద్ద‌రు ఆట‌గాళ్లు పునరాగమనం చేస్తారని అందరూ భావించారు. కానీ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఈ నిషేధిత ఆటగాళ్లకు అవకాశం కల్పించలేదు. స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు గాయాల నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టారని, వారి పునరాగమనానికి ఇండియన్‌ ప్రీమియల్‌ లీగ్‌(ఐపీఎల్‌) సరైనదిగా భావిస్తున్నారని ఆ జట్టు సెలక్షన్‌ ఛైర్మెన్‌ ట్రెవెర్‌ హాన్స్‌ తెలిపారు.డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున, స్మిత్‌ రాజస్థాన్‌ నుంచి బరిలోకి దిగుతారని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -