Saturday, April 27, 2024
- Advertisement -

IPL చరిత్రలో సంచలనం

- Advertisement -

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ తలపడి, ముంబయి అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో ముంబయి యంగ్ బౌలర్ ఆకాశ్ మద్యాల్ ఐపీఎల్ చరిత్రలో సంచలనం సృష్టించారు.

ఐపీఎల్ 2009లో కుంబ్లే రాజస్థాన్ రాయల్స్ పై 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించారు. ఇప్పుడు అనిల్ కుంబ్లే రికార్డును మధ్వాల్ సమం చేశాడు. కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఆకాశ్ మధ్వాల్ కూడా కుంబ్లే సరసన చేరాడు.

ఐపీఎల్‍లో తక్కువ ఎకానమీ రేటు 1.43తో 5/5 వికెట్లు తీసిన తొలి అన్‍క్యాప్డ్ ప్లేయర్‍గా నిలిచారు. తర్వాత స్థానంలో పంజాబ్ ప్లేయర్ అంకిత్ రాజ్‍పూత్ (5/14), వరుణ్ చర్రవర్తి (5/20), ఉమ్రాన్ మాలిక్ (5/25) ఉన్నారు.

ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఈ నెల 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ లో గెలిసిన జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ నెల 28న జరిగే ఫైనల్స్‌ లో తలపడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -