Monday, May 6, 2024
- Advertisement -

రాహుల్ రాగాల‌కు ఏపీ ప్ర‌భుత్వం, ప‌వ‌న్ భారీ న‌జ‌రానా

- Advertisement -

ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లో జ‌రుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించి తెలుగు కీర్తిని క్రీడాకారుడు రాగాల వెంక‌ట రాహుల్ ప్ర‌పంచానికి చాటాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాగాల రాహుల్ వెయిట్‌ లిఫ్టింగ్‌ 85 కిలోల విభాగంలో రాహుల్‌ పసిడి గెలిచాడు. దీంతో అత‌డికి దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

అయితే రాహుల్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాహుల్ ఎక్కడ కోరుకొంటే అక్కడ 500 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధ‌మ‌య్యింది. తాము స్థ‌లం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్ ప్ర‌క‌టించారు. రాహుల్ శ్రీకాకుళం జిల్లాకు రాగానే ఘనంగా సత్కరిస్తామని చెప్పారు. రాహుల్‌కు ప్రభుత్వం ప్రకటించిన అన్ని ప్రోత్సా హకాలను అందజేస్తామన్నారు.

రాహుల్ రాగాల‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభినందించి భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. ‘నీవు సాధించిన ఘన విజయంతో గర్విస్తున్నాం. మా పార్టీ నీకు సలాం చేస్తున్నది. జనసేన తరఫున రాహుల్‌కు రూ. 10 లక్షల నజరానా అందజేస్తున్నాం’ అని ట్వీట్ట‌ర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ప్ర‌క‌ట‌న చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -