Monday, May 6, 2024
- Advertisement -

మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్‌ల‌కు నిర‌స‌న‌గా భార‌త్ బంద్

- Advertisement -

మతపరమైన రిజర్వేషన్లను కేటాయించ‌డానికి వ్యతిరేకిస్తూ మంగళవారం (ఏప్రిల్ 10) చేప‌ట్టిన భారత్ బంద్ ప్ర‌శాంతంగా కొన‌సాగింది. కొన్ని విద్యార్ధి, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఉత్త‌ర భార‌త‌దేశంలో బంద్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. బంద్ దృష్ట్యా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్ష‌న్‌ను విధించారు. బీహార్‌లోని ఆర్రాలో ఆందోళనకారులు రైలును ఆపేశారు. దర్బంగాలో అలజడి సృష్టించారు. ఆందోళనలు నిర్వహించాలంటూ వాట్సాప్‌లో సందేశాలు, సోష‌ల్ మీడియాలో ఇలాంటి ప్ర‌చారం రావ‌డంతో బంద్ విజ‌య‌వంతంగా సాగింది. దీంతో చాలాచోట్ల ఇంటర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు. మధ్యప్రదేశ్‌లోని బింద్, మోరీనా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లు వద్దంటూ బీహార్‌లో నిరసనకారులు ర్యాలీ తీశారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్నిసడలించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 2వ తేదీన దళిత సంఘాలు చేప‌ట్టిన దేశవ్యాప్తంగా బంద్ ఉద్రిక్తంగా మారింది. ఆ నిర‌స‌న‌ల‌తో 10 మంది మృతి చెందారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంగ‌ళ‌వారం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేప‌ట్టిన బంద్‌ను కట్టుదిట్టమైన భద్రత క‌ల్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -