Monday, May 5, 2025
- Advertisement -

హోం గ్రౌండ్స్‌లో చెన్నైకి తప్పని ఓటమి

- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో ఓటమిని మూట గట్టుకుంది చెన్నై. పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది చెన్నై. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై…17.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులతో గెలిచింది.

బెయిర్ స్టో (46), రిలీ రోసోవ్ 23 బంతుల్లో 43 పరుగులు చేయగా శశాంక్ సింగ్ 25 పరుగులతో రాణించడంతో పంజాబ్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (62) పరుగులతో మరోసారి రాణించగా రహానె (29) ,సమీర్ రిజ్వి (21), మొయిన్ అలీ (15) పరుగులు చేశారు. హర్‌ప్రీత్ బ్రార్ (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -