Saturday, May 3, 2025
- Advertisement -

ఆర్సీబీ ఆశలు ఈసారి గల్లంతు!

- Advertisement -

ఐపీఎల్ ట్రోఫిని సాధించాలన్న ఆర్సీబీ ఆశలు ఈసారి గల్లంతయ్యాయి. రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది బెంగళూరు. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 173 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది రాజస్థాన్. ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(45), రియాన్ ప‌రాగ్(35), షిమ్ర‌న్ హెట్‌మైర్‌(26), రొవ్‌మ‌న్ పావెల్(16 నాటౌట్) రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(33), ఫాఫ్‌ డూప్లెసిస్(17,ర‌జత్ పాటిదార్(34), మ‌హిపాల్ లొమ్‌రోర్(32) రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ క్వాలిఫైయర్ 2లో హైదరాబాద్‌తో తలపడనుంది. అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -