తాజా ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలను సాధిస్తోంది. ప్లే ఆప్‌లో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో చక్కని ప్రదర్శన కనబరిచిన రాయల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్ పాండే (61) అర్ధశతకం సాధించాడు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలిచింది. సామ్సన్ (48), లివింగ్‌స్టోన్ (44) రాణించారు. రెండు వికెట్లను తీసిన ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు నిలుపోగా, సన్‌రైజర్స్ జట్టు తమ ప్లే ఆఫ్ అవకశాలను క్లిష్టం చేసుకుంది.
- Advertisement -
ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకున్న రాజస్థాన్ రాయల్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -