Thursday, May 2, 2024
- Advertisement -

క్లాష‌న్ విష‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ప్పుచేసింది…డీన్ జోన్స్

- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ జట్టు తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో సఫారీ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసన్‌ ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ లో క్లాసన్‌ కు అంత అనుభవం లేదని గుర్తు చేశాడు.

అతని కంటే న్యూజిలాండ్‌ ఆటగాడు లూక్‌ రోంచిని తీసుకుని ఉండాల్సిందని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఒత్తిడిని ఎదుర్కొనేలా చేస్తుందని, రోంచీ నిరూపించుకున్న ఆటగాడని చెప్పాడు. అజింక్య రహానెకు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

బాల్ ట్యాంప‌రింగ్ విష‌యంలో స్టీవ్‌ స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా 12 నెలల పాటు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడనుంది. హైదరాబాద్‌ వేదికగా ఏప్రిల్‌ 9న ఈ మ్యాచ్‌ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -