మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
ఈ సీజన్లో జట్టుకు కెప్టెన్‌గా రియాన్ పరాగ్ బాధ్యతలు చేపట్టడం అలాగే రవీంద్ర జడేజా చేరికతో జట్టు మరింత బలంగా మారింది. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు వైభవ్ సూర్యవంశీ.
వన్‌డౌన్‌లో హెట్మెయిర్ రానుండగా నాలుగు, ఐదు స్థానాల్లో రియాన్ పరాగ్, ధృవ్ జురేల్ బ్యాటింగ్‌కు రానున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ గాయంతో దూరమైన నేపథ్యంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించనున్నాడు. అలాగే దోనోవన్ ఫెర్రీరా కూడా తుదిజట్టులో ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది.
బౌలింగ్ విభాగంలో ఆడమ్ మిలైన్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ ఉన్నారు.
ఆర్ఆర్ ప్లేయింగ్ XI
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరెరా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే, సందీప్ శర్మ
