Sunday, May 19, 2024
- Advertisement -

కోహ్లీనీ పొగ‌డాలంటే కొత్త డిక్ష‌న‌రీ కావాలి….

- Advertisement -

దక్షిణాఫ్రికా గడ్డ మీద విరాట్ కోహ్లి పరుగుల వ‌ర‌ద పారించారు. టెస్టుల్లోను, వ‌న్డేల్లో త‌న‌దైన శైలిలో బ్యాట్ ఝులిపించాడు. వ‌న్డేసిరీస్‌లో మూడు సెంచ‌రీలు సాధించిన కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించి.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లిని మాజీలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అతడి బ్యాటింగ్ స్టయిల్‌ను అభివర్ణించడానికి మాటలు సరిపోవడం లేదంటూ కెప్టెన్‌ ఆటతీరుపై ప్రశంసలు గుప్పించాడు టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి. ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేశాడు.కోహ్లి బ్యాటింగ్ స్టయిల్‌కు మైమర్చిపోయాను. అతణ్ని పొగిడేందుకు పదాలే కరవయ్యాయి. విరాట్‌ను ప్రశంసించాలని అనుకునేవారు లేటెస్ట్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొనుక్కొని తమ పద సంపదను పెంచుకోవాలంటూ.. రవిశాస్త్రి కెప్టెన్‌ ఆటతీరును ఆకాశానికి ఎత్తాడు.

ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పిన చీకూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. చేతల్లో చేసి చూపే ఇలాంటి నాయకుడు ఉంటే.. మిగతా ఆటగాళ్లు కూడా తనను ఫాలో అవుతారు. అద్భుతమైన జట్టుకు కోచ్‌గా ఉన్నందుకు గర్వంగా ఉంద‌ని ర‌విశాస్త్రి తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -