Friday, May 17, 2024
- Advertisement -

బాబుకు ఓటుకునోటు కేసు షాక్‌..

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఓటుకు నోటు కేసు  ఎంత‌ సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. కేసులో అప్ప‌టి టీడీపీనేత రేవంత్ రెడ్డి , ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరిపోయారు. మొద‌ట ఈకేసు విచార‌ణ ముమ్మ‌రంగా జ‌రిగినా త‌ర్వాత కేసు విచార‌న మంద‌గించింది. అయితే ఇప్పుడు మ‌రో సారి ఈకేసును విచార‌ణ‌కు తెచ్చేందుకు రంగం సిద్ద‌మైంద‌నే చెప్పాలి.

ప్రతిపక్ష వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు, అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఆళ్ల చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తున్న విషయం అందరకీ తెలిసిందే. అదే వరసలో త్వరలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసును తిరగతోడుతున్నారు.

ఈ కేసు ప్రస్తుతం సుప్రింకోర్టులో విచారణ జరుగుతోంది. మొన్నటి 5వ తేదీనే విచారణ జరగాల్సి ఉన్నా ఎందుకనో విచారణ జరగలేదు. అయితే ఈనెలాఖరులోగా ఎలాగైనా విచారణకు తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారంట ఆర్కె. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణా ఏసిబి తమ వాదనలను సీల్డ్ కవర్లో సుప్రింకోర్టుకు అందచేసింది. అదేవిధంగా చంద్రబాబు, స్టీఫన్ సన్ ఫోన్ సంభాషణల టేపులను కూడా ఏసిబి కోర్టు ముందుంచింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి కూడా రిపోర్టులు కోర్టుకు అందాయి.

ఓటుకు నోటు కేసు విచార‌ణ‌కు రాకుండా దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే కేంద్రంతో బాబు రాజీప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు అన్ని వైపుల‌నుంచి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఒత్తిడిలో ఉన్న చంద్ర‌బాబుకు ఈకేసు విచార‌న‌కు వ‌స్తే బాబుకు మ‌రిన్ని చిక్కులు త‌ప్ప‌వు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -