- Advertisement -

జింబాబ్వేతో మ్యాచ్‌కు రింకూ సింగ్!

- Advertisement -

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా టీ20 వరల్డ్ కప్ 2026 మధ్యలో స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చేరడంతో రింకూ వెంటనే భారత్‌కు తిరిగివచ్చారు. అయితే ఇప్పుడు జింబాబ్వేతో జరుగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆయన మళ్లీ భారత జట్టులో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 26న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 సాయంత్రానికి రింకూ జట్టుతో కలిసే అవకాశం ఉందని తెలిపారు.

రింకూ ఆడకపోతే అతని స్థానంలో ఎవరు వస్తారన్న చర్చలు జోరుగా సాగాయి. అయితే కోటక్ వ్యాఖ్యలతో రింకూ జింబాబ్వే మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. టోర్నమెంట్‌లో కొనసాగాలంటే జింబాబ్వేపై ఘన విజయం సాధించడం తప్పనిసరి. కోటక్ మాట్లాడుతూ..భారత్‌లో వరల్డ్ కప్ జరుగుతుండటంతో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఒత్తిడిని సానుకూలంగా ఎదుర్కోవాలి. మా జట్టు ఆ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఉంది. మాకు కావాల్సింది మోమెంటమ్ మాత్రమే అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -