- Advertisement -

15 నిమిషాల్లో శ్రీవారి దర్శనం..విమర్శలపై శివాని!

- Advertisement -

లిటిల్ హార్ట్స్ , అంజాజిపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి శివాని నగరం. ఇటీవల తిరుమల దర్శనం గురించి చేసిన వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు.కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి 15 నిమిషాల దర్శనం పొందిన అదృష్టం కలిగిందని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కొంతమంది భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ భక్తులకు కొన్ని సెకన్ల దర్శనం కూడా కష్టమవుతుందని, ఆమెకు 15 నిమిషాల దర్శనం ఎలా లభించిందని ప్రశ్నించారు.

ఈ విమర్శల నేపథ్యంలో శివాని నాగరం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలో తన బాల్యం, సినీ ప్రయాణం, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడినప్పుడు, తిరుమల సందర్శన గురించి చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

2025 అక్టోబర్‌లో తాను, తన తల్లి కలిసి ఎయిర్‌పోర్టులో లైన్‌లో నిలబడి ‘శ్రీవాణి’ దర్శన టికెట్లు కొనుగోలు చేసి ఆలయానికి వెళ్లామని ఆమె చెప్పారు. క్యూ లైన్‌లో ప్రవేశించినప్పటి నుంచి గర్భగుడి వరకు వెళ్లే మార్గంలో స్వామివారి విగ్రహం భక్తులకు వివిధ దశల్లో కనిపిస్తుందని, ఆ మొత్తం సమయంలో స్వామివారి దర్శనం తనకు సుమారు 15 నిమిషాల పాటు కనిపించిందని అంచనా వేశానని పేర్కొన్నారు.

తాను స్వామివారి ముందు నిరంతరంగా 15 నిమిషాలు నిలబడ్డానని లేదా ప్రత్యేక సదుపాయం పొందానని ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కుటుంబంతో కలిసి రూ.300 సాధారణ టికెట్ ద్వారా వెళ్లినప్పుడు కేవలం ఐదు సెకన్ల దర్శనం మాత్రమే లభించిందని గుర్తుచేశారు. 13 సంవత్సరాల తర్వాత స్వామివారిని సమీపంగా చూడడం భావోద్వేగంగా అనిపించిందని, ఆనందంతో ఆ అనుభవాన్ని పంచుకున్నానని తెలిపారు.

https://www.instagram.com/p/DVLYAYkiRb3

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -