Saturday, April 27, 2024
- Advertisement -

కెప్టెన్సీకి గుడ్ బై..ఫ్యాన్స్ కు షాకిచ్చిన రోహిత్!

- Advertisement -

ఐపీఎల్‌ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు జట్ట ఎంపికపై కసరత్తు చేస్తుండగా తాజాగా ముంబై ఇండియన్స్ మాత్రం ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు షాకిచ్చింది. ముంబైకి నాలుగు ఐపీఎల్‌ కప్‌లు అందించాడు రోహిత్. అయితే అనూహ్యంగా ముంబై కెప్టెన్సీ నుండి రోహిత్ తప్పుకోవడంతో ఆయన్ని ముంబై యాజమాన్యం తప్పించిందనే ప్రచారం జరుగుతోంది.

ఇక హిట్ మ్యాన్‌ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఐపీఎల్ 2023 కప్ గెలవలేకపోయిన రోహిత్…వరల్డ్ కప్‌కు అడుగుదూరంలో నిలిచిపోయాడు. దీంతో ఇది రోహిత్‌ని బాగా కుంగదీసినట్లు తెలుస్తోంది.

అయితే రోహిత్ కెరీర్‌లో 2023 ఓ పీడకలే. ఎందుకంటే వరుస ఓటములు కెప్టెన్‌గా రోహిత్‌కు కలిసి రాలేదు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత మెగాటోర్నీ వరల్డ్ కప్ ఫైనల్లో చతికిలపడిపోవడంతో రోహిత్ శర్మనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పికున్నాడని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ముంబైకి కొత్త సారధిగా హార్ధిక్ పాండ్యా వ్యవహరింనుండగా రోహిత్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -