Saturday, May 18, 2024
- Advertisement -

జహీర్‌తో పెళ్లి కోసం.. ఆ హీరోయిన్ ఒత్తిడి తెచ్చుకుంటుంది

- Advertisement -

టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తో పెళ్లికి ఒత్తిడి, ఉత్సాహంతో తాను రెడీగా ఉన్నట్లు సినీ నటి సాగరిక తెలిపింది. చెక్ దే ఇండియా మూవీలో హాకీ క్రీడాకారిణిగా అందర్నీ మెప్పించిన సాగరికతో ఈ సంవత్సరం ఏప్రిల్ లో జహీర్ ఖాన్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరి పెళ్లి నవంబర్ చివరి వారంలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ముంబయిలో షాపింగ్ చేస్తున్న సాగరికతో వీడియో మాట్లాడింది. ‘పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ ఒకింత ఒత్తిడికి లోనవుతుంటారు. అదే టైంలో మాటల్లో చెప్పలేనంత చెప్పలేనంత ఉత్సాహం కూడా వారిలో ఉంటుంది. ఎందుకంటే.. అలా ఆ శుభాకార్యం కోసం ప్లానింగ్ చేస్తాం. ప్రస్తుతం నేను అలాంటి ఫీలింగ్స్ ను అనుభవిస్తున్నాను’ అని సాగరిక తెలిపింది.

ప్రస్తుతం హిందీ, పంజాబి, మరాఠి సినిమాల్లో వరుస ఛాన్సులతో బిజీగా ఉన్న ఈ భామ పెళ్లి తర్వాత నటనపై ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపింది. ఇంకోవైపు జహీర్ ఖాన్.. క్రికెట్ మ్యాచ్ కామెంటేటర్‌గా చక్కగా రాణిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -