Monday, May 20, 2024
- Advertisement -

ర‌స‌కందాయంలో జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్పం పాద‌యాత్ర‌

- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అటు ప్ర‌భుత్వం….ఇటు వైసీపీ మ‌ధ్య రాజ‌కీయ ర‌క్తి క‌డుతోంది. ఒక వైపు పాద‌యాత్రకు అధికార పార్టీ బ్రేకులు వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటె….మ‌రో వైపు జ‌గ‌న్ త‌న పాద‌యాత్రను పూర్తి చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. పాద‌యాత్ర‌కు ప‌ర్మిష‌న్ అవ‌స‌రం అంటూ బాబు నుంచి మంత్రుల వ‌ర‌కు స‌న్నాయి నొక్కులు నొక్కుతూ బ్రేక్ వేయాల‌నె వ్యూహాలు ప‌న్నుతున్నార‌నె సంకేతాలు ఇచ్చారు. దీంతో వైసీపీ అల‌ర్ట్ అయ్యింది. బాబు వేసిన మాస్ట‌ర్ ప్లాన్‌కి జ‌గ‌న్ దిమ్మ‌తిరిగే చెక్ఖ పెట్టారు.

రాజ‌ధాని అమ‌రావ‌తిలో కొత్త‌గా క‌ట్టిన సెక్ర‌టేరియ‌ట్‌లోకి నీల్లు రావ‌డం వెనుక వైసీపీ హ‌స్తం ఉంద‌ని పైపులు కోశార‌ని సెల‌విచ్చారు స్పీక‌ర్ . దీనికి తోడు తుని సంఘ‌ట‌న వెనుక జ‌గ‌న్ ఉన్న‌ట్లు అయితె దాన్ని నిరూపించాలి క‌దా….అధికారంలో బాబు చేతుల్లోనె ఉంది. ఇవ‌న్నీ చూస్తుంటె బాబులో అస‌హ‌నం, అక్క‌సు ప్ర‌ద‌ర్శించడం త‌ప్ప వేరొక‌టి కాద‌నె చెప్పాలి.

పాద‌యాత్రల చ‌రిత్ర చూసుకుంటె రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు కూడా 2014కుముందు పాద‌యాత్ర చేశారు..దానికి అనుమ‌తి తీసుకున్నారా….? అంత‌కు ముందు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేశారు…దానికి అనుమ‌తి తీసుకున్నాడా…? స‌్వాతంత్య్ర‌యం రాక‌ముందు అనేక మంది పాద‌యాత్ర‌లు చేశారు. దేనికి అనుమ‌తులు ఉండ‌వు. గ‌తంలో జ‌గ‌న్ అనేక చోట్ల‌కు వెల్లాడు కాని ఎక్క‌డా ఎలాంటి విధ్వంస సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు. ప్ర‌తి ప‌క్ష‌నేత‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొనె దానికి పాద‌యాత్ర చేసె హ‌క్కు ఉంటుంది. దానికి ప్ర‌భుత్వం అనుమ‌తి అవ‌స‌ర‌మా…? జ‌గ‌న్ ఏమ‌న్నా ధ‌ర్నాలు,ర్యాలీలు చేస్తున్నారా. చేస్తున్న ది పాద‌యాత్ర‌.

ముద్ర‌గ‌డ‌ను గృహ‌నిర్భంధం చేసిన‌ట్లు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అలా బ్రేకులు వేయాల‌ని ఇదంతా బాబు మాస్ట‌ర్ ప్లానా…? అందుకె వైసీసీ కూడా అక‌డుగు ముందుకు వేసి బాబా మాస్ట‌ర్ ప్లాన్‌కి దిమ్మ‌తిరిగే ప్లాన్ వేసింది. ఆరునెల‌ల‌పాటు పాద‌యాత్ర చేస్తున్నాన‌ని త‌గు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని జ‌గ‌న్ డీజీపీకి లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. జ‌గ‌న్ జెడ్‌క్యాట‌గెరీ భ‌ద్ర‌త‌లో ఉండ‌టంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మ‌ల్సీలు పాద‌యాత్ర‌లో ఉంటారు గ‌నుక ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని లేఖ‌లో కోరారు.

అయితె ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న రాలేదు. స్పంద‌న వ‌చ్చినా రాకున్నా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన భాధ్య‌త పోలీసుల‌మీద ఉంది. ఇప్ప‌టికె అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిస్క‌రించి వైసీపీ ఒడుగు ముందుకు వేసింది. ఇప్ప‌టికె పాద‌యాత్ర‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి కాబ‌ట్టి టీడీపీ స్పంద‌న‌, ప్ర‌భుత్వం స్పంద‌న ఎలాఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -