ఐపీఎల్ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఓడి అందరిని నిరాశ పరిచిన హైదరబాద్ జట్టు తరువాత పుంజుకుని వరుస విజయాలతో అభిమానులను అలరిస్తోంది. గురువారం ఢిల్లీ ఫిరోషా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (43) ఒక్కడే రాణించాడు.మొహమ్మద్ నబీ 2 కీలక వికెట్లను తీశాడు.తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (48) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా బెయిర్‌స్టోకు దక్కింది. ఈ విజయంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.
- Advertisement -
హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ జట్టు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -