Monday, May 5, 2025
- Advertisement -

మూడోసారి ఫైనల్‌కు సన్‌రైజర్స్

- Advertisement -

2018 తర్వాత ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది హైదరాబాద్‌. ఓవరాల్‌గా మూడోసారి ఫైనల్‌కు చేరుకోగా టైటిల్ వేటలో కోల్‌కతాతో తలపడనుంది సన్‌రైజర్స్‌. సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది హైదరాబాద్. చెపాక్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ విధించిన 176 పరుగుల లక్ష్యచేదనలో కేవలం 139 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్.

ధ్రువ్‌ జురెల్‌ 35 బంతుల్లో 56 నాటౌట్‌ నిలవగా కోహ్లర్‌ (10),సంజూ శాంసన్‌ (10),పరాగ్‌ (6) పరుగులే చేశారు. ఒక్కొక్కరుగా బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్ బాట పట్టడంతోరాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 34 బంతుల్లో 50 పరుగులు చేయగా రాహుల్‌ త్రిపాఠి 15 బంతుల్లో 37 పరుగులు చేశారు. షాబాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -