Tuesday, May 14, 2024
- Advertisement -

టీ 20లో విరాట్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన పాక్ క్రికెట‌ర్‌..

- Advertisement -

టీ 20లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్ బ‌ద్ద‌లు కొట్టాడు.ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్‌ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అంత‌ర్జాతీయంగా టీ20 మ్యాచుల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు సాధించిన రికార్డును కైవసం చేసుకున్నాడు.

భారత సారథి కోహ్లి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకుంటే.. బాబర్‌ 26 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించి అతని రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ 47 పరుగులతో విజయం సాధించి 3-0తో కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -