ఎన్నో భారీ అంచనాల మద్య పొట్టి ప్రపంచ కప్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అంతకు మూడు జరిగిన ఆసియా కప్ లో నిరాశపరిచినప్పటికి పొట్టి ప్రపంచ కప్ లో ఎలాగైనా సత్తా చాటి కప్పుతో స్వదేశానికి తిరిగి రావాలని భావించింది. అయితే టీమిండియా కీలక ఆటగాళ్లు బుమ్రా, జడేజా వంటి ఆటగాళ్లు జట్టుకు దూరమవ్వడంతో జట్టు కూర్పు పై అభిమానుల్లో మొదటి నుంచి సందేహాలు ఉన్నాయి. అంతే కాకుండా టోర్నీ కి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ పైన కూడా అందరిలోనూ అనుమానాలు.. దీంతో కప్పు వేటలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో అని అందరిలోనూ అనుమానాలు గట్టిగానే ఉండేవి. అయితే అందరి అంచనాలను తలకిందూలు చేస్తూ సూపర్ 12 లో అద్భుతంగా రాణించింది రోహిత్ సేన.
పాకిస్తాన్, జింబాబ్వే, నెదర్లాండ్ వంటి జట్లపై గెలిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వీటన్నిటి కన్నా ముఖ్యం విరాట్ కోహ్లీ భీకర ఫామ్ లోకి రావడం ఆడిన ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ తనదైన మార్క్ చూపించాడు. దీంతో ఇక టీమిండియా కు తిరుగులేదు అనుకూన్నారంతా.. కచ్చితంగా కప్పు మనదే అనే భావనకు వచ్చారు అభిమానులు. అయితే ఎవరు ఊహించని విధంగా సెమీల్ లో మాత్రం అందరి ఆశలు అవిరయ్యాయి. కచ్చితంగా గెలవాల్సిన సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అసలు సెమీస్ ఆడుతుంది టీమిండియా నేనా అనే డౌట్ ప్రతి ఒక్క క్రీడా అభిమానికి వచ్చిందంటే.. రోహిత్ సేన ఎంత దారుణమైన ప్రదర్శన కనబరిచిందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క వికెట్ కూడా తియ్యకుండా విజయాన్ని ప్రత్యర్థి జట్టుకు కట్టబెట్టింది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అలాగే రోహిత్ రోహిత్ కెప్టెన్సీ పై దారుణమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు వచ్చే వరల్డ్ కప్పు లో కొనసాగడం కష్టమేనని, ఇకపై యువకులకు అధిక ప్రదాన్యం కల్పించే అవకాశం ఉందని, బీసీసీఐ చెందిన ఓ అధికారి కూడా చెప్పుకొచ్చాడు.
దీంతో రోహిత్, కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్ మెన్స్ స్థానం ప్రశ్నార్థకమే అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు మాజీ క్రికెటర్లు.. ఆటలో గెలుపు ఓటములు సహజం అని,, దేన్నైనా సమానంగా తీసుకోవాలని సచిన్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంచితే సెమీస్ లో రోహిత్ కెప్టెన్సీ లోపం స్పష్టంగా కనిపించిందని కొందరు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లెగ్ స్పిన్నర్ లకు అనుకూలించే పిచ్ పై చహల్ నూ పక్కన పెట్టి ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కు చోటు ఇవ్వడం, అలాగే సరైన సమయంలో పక్కా వ్యూహాలను అమలు చేయడంలో రోహిత్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడని కొందరు చెబుతున్నారు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ కి రిటైర్ ఇవ్వాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీటిపై బీసీసీఐ ఎలా స్పందిస్తోందో చూడాలి.