Sunday, April 28, 2024
- Advertisement -

ఇండియా దారుణ ఓటమి.. కప్పు వేటలో రోహిత్ సేన జర్నీ సమాప్తం !

- Advertisement -

ఆస్ట్రేలియా లో జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. సూపర్ 12 లో అద్భుతంగా రాణించిన టీమిండియా. సెమీస్ లో మాత్రం చేతులెత్తేసింది. కచ్చితంగా గెలవాసిన సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓటమిపాలు అయింది. మ్యాచ్ చూసే వారికి అసలు ఆడుతుంది టీమిండియానేనా అనే డౌట్ రాక మానదు. అంతా ఫెళవమైన ఆటతీరుతో దారుణంగా నిరాశపరిచింది. మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

కే‌ఎల్ రాహుల్ మరోసారి ఫెళవమైన బ్యాటింగ్ తో నిరాశపరుచగా రోహిత్ శర్మ 27 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు, హర్ధిక్ పాండ్య 33 బంతుల్లో 63 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది టీమిండియా. ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదటి నుంచి కూడా ధాటిగా ఆడుతూ టీమిండియా బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. అసలు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని చేదించిందంటే ఇంగ్లండ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులు ( 9ఫోర్లు, 3 సిక్సులు ), అలెక్స్ హలెస్ 47 బంతుల్లో 86 పరుగులు ( 4ఫోర్లు, 7 సిక్సులు ) వీర విహారం చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అసలు భారత బౌలర్లు ఏ మాత్రం పసలేని బౌలింగ్ తో చేజేతులా విజయాన్ని ఇంగ్లండ్ కు అప్పగించరానే చెప్పవచ్చు. భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింగ్, అశ్విన్, శమి వంటి స్టార్ బౌలర్లు అంతా కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు ఎలాంటి వికెట్ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. ఇక ఈ నెల 13 న జరిగే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది ఇంగ్లండ్. ఏది ఏమైనప్పటికి టీమిండియా ఇంత దారుణమైన ఓటమి చవిచూస్తుందని బహుశా ఈ భారత అభిమాని ఊహించి ఉండడేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -