Saturday, May 4, 2024
- Advertisement -

విరాట్ కోహ్లీ, అనుష్కల పెళ్లి.. డిసెంబర్ లో ఫిక్స్..?

- Advertisement -

భారత్ కెప్టన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ భామ అనుష్క శర్మలు గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరు ప్రేమించుకుంటున్నట్లు అందరికి తెలిసినప్పటికి వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు పెళ్లి విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో వీరు పెళ్ళి చేసుకోబోతున్నారట. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. డిసెంబర్ లో తనకు సెలవు కావాలని బీసీసీఐని కోరాడట. పెళ్లి కోసమే సెలవు కోరినట్లు తెలుస్తోంది. పెళ్ళి పనులు చక్కదిద్దుకోడానికి అతడు విరామం తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో ఏది నిజమో అఫీషియల్ గా తెలియదు కానీ.. పెళ్లి మాత్రం డిసెంబర్ లో అనే వార్తలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.

ఇటీవలే వీరిద్దరూ కలిసి చేసిన ఓ యాడ్ అందరినీ అలరిస్తోంది. ఇద్దరిదీ చూడముచ్చటైన జంట అని నెటిజన్లు అంటున్నారు. 2013 ఇంగ్లాండ్ టూర్ లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ టూర్ లకు వెళుతూ.. పలు ప్రాంతాల్లో కనిపిస్తూ అలా వార్తల్లో నిలిచారు. ఏది ఏమైన.. కోహ్లీ పెళ్లి విషయంపై అధికారికంగా చెప్పేవరకు ఇలాంటి వార్తలు నమ్మలేం అని కోహ్లీ ఫ్యాన్స్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -