Sunday, May 19, 2024
- Advertisement -

ఎలాంటి గాయం లేకుండా రక్తమోడుతున్న పేషంట్….

- Advertisement -

ఎవ‌రికైనా శ‌రీరానికి గాయాలు అయితె ర‌క్తం కార‌డం చూశాం. కాని శరీరం మీద ఒక్క చిన్నగాటైనా లేకుండా ఓ యువతి ముఖం, అరచేతుల నుంచి రక్తం వస్తుండటం మీరు ఎప్పుడైనా చూశారా. అవును అది నిజం. అర్ధరాత్రి శరీరం మీద ఎలాంటి గాయాలు లేకుండా ముఖం నిండా రక్తంతో వచ్చిన యువతిని చూసిన వైద్యులు షాక్ తిన్నారు.

వివ‌రాల్లోకి వెల్తె ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీకి చెందిన 21 ఏళ్ల యువతి  రక్తం కారుతోందని పురాతనమైన యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్ వైద్యశాలకు వచ్చింది. ఆమె శరీరంపై చిన్నగాయం కూడా లేదు. అయితే ఆమె శరీరం నిండా రక్తం కారుతోంది. యూనివర్సిటీ ప్రత్యేక వైద్యులంతా ఆశ్చర్యపోయారు.

అయితే గత మూడేళ్లుగా తానీ సమస్యతో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కాసేపటికే ఆమె శరీరం నుంచి కారుతున్న రక్తం దానంతట అదే ఆగిపోయింది. ఇదెలా అని అడిగితే గాఢ నిద్రలో ఉన్నా, తీవ్ర ఒత్తిడి గురైనా, అలసిపోయే పని చేసినా తనకు ఒత్తిడి పెరుగుతోందని, అలా ఒత్తిడి పెరగగానే తన శరీరం నుంచి రక్తం కారడం మొదలవుతోందని ఆమె తెలిపింది. ఒత్తిడి తగ్గిన కాసేపటికే రక్తం కారడం ఆగిపోతోందని ఆమె తెలిపింది.

దీంతో తొలుత వైద్యులు ఆమెకు యాంటీ యాంగ్జైటీ మందులు ఇచ్చారు. అప్పటికి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అనుమానం వచ్చి పరీక్షించగా ఆమెకు ‘హెమటోహైడ్రోసిస్‌’ అనే వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారి శరీరం నుంచి చెమటకు బదులు రక్తం వస్తుంది. ప్రపంచంలో ఇలాంటి కేసులు గత పదిహేనేళ్లలో 24 మాత్రమే నమోదైనట్లు డాక్టర్లు జర్నల్‌లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -