Thursday, May 16, 2024
- Advertisement -

కోహ్లీని చూస్తే ఇమ్రాన్‌ఖాన్ గుర్తుకొస్తారు….

- Advertisement -

టీమిండియాను స్వ‌దేశంలోనూ, విదేశీగ‌డ్డ‌పై విజ‌య‌ప‌థంలో న‌డిస్తున్నాడు విరాట్ కోహ్లీ. సఫారీ గడ్డపై బ్యాటింగ్ లో రాణించడంతోపాటు.. కెప్టెన్ గానూ జట్టును విజయపథంలో నిలిపిన విరాట్ కోహ్లిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి ప్రశంసలు గుప్పించాడు. పాకిస్థాన్ కు ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తో కోహ్లిని పోల్చాడు. ‘

విరాట్ ఇంకా కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడు. అతడింకా యువకుడే. కానీ ఇప్పటికే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. అతడు ఇమ్రాన్ ను గుర్తుకు తెస్తున్నాడు. పాకిస్థాన్ దిగ్గజ కెప్టెన్ లోని లక్షణాలు కోహ్లి ఉన్నాయ’ని రవిశాస్త్రి తెలిపాడు.

వన్డేల్లో నంబర్ 1 ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో 500కిపైగా పరుగులు చేశాడు. సఫారీ గడ్డ మీద ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో కోహ్లి వరుసగా.. 112, 46*, 160*, 75, 36, 129* చొప్పున పరుగులు రాబట్టాడు

ఇమ్రాన్ ఖాన్ 1992లో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ అందించాడు. ఆ దేశ అత్యుత్తమ క్రికెటర్లలో అతడొకడు. ఇమ్రాన్ తరహాలోనే విరాట్ కూడా ఎప్పుడూ ఆధిక్యం కనబర్చాలనే తపనతోనే ఆడతాడని రవిశాస్త్రి చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -