టీవీ5 సాంబశివరావు అక్రమాలకు హెచ్ పీసీఎల్ అడ్డుకట్ట వేసింది. హైదరాబాద్ మాదాపూర్ లో ల్యాండ్ నకిలీ ధ్రువపత్రాలతో పెట్రోల్ బంక్ తీసుకున్నారు సాంబ.పెట్రోల్ బంక్ స్థలంను హెచ్ పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు.
ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నిర్వహణ చేపట్టారు సాంబ. ల్యాండ్ ఓనర్ ఫిర్యాదుతో మాదాపూర్ పీఎస్ లో చీటింగ్ కేసు నమోదైంది.
ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గతంలోనే చెప్పారు అధికారులు. రూపాయి పెట్టుబడి లేకుండానే బురిడీ కొట్టించారు సాంబశివరావు. ఆక్రమిత బంక్ స్థలాన్ని సీజ్ చేశారు హెచ్ పీసీఎల్ అధికారులు.

