Friday, May 9, 2025
- Advertisement -

అమ్మకు మాట ఇచ్చా.. ఆ పని చేయను అని.. : యువరాజ్ సింగ్‌

- Advertisement -

మైదానంలో సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించె యువరాజ్ సింగ్‌కు అమ్మ అంటే ఎంత అభిమానమో అందరికి తెలిసిందే. మైదానంలో దూకుడుగా ఆడే యువరాజ్.. అమ్మ దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతున్నాడు. ఒంటి చేత్తో జట్టుకు వరల్డ్ కప్ అందించిన ఈ ఆల్‌రౌండర్‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.

ధోనీ తరహాలోనే బైక్ మీద దూసుకెళ్లేందుకు ఇష్టపడేవాడు. కానీ యువరాజ్ సింగ్‌ తన తల్లికి ఇచ్చిన బైక్ నడపడం లేదని చెప్పాడు. బైక్ నడపడం అంటే నాకెంతో ఇష్టం. కానీ ఏ రోజైతే బైక్ రైడ్ చేస్తావో.. అదే రోజు నేను నీ దగ్గర్నుంచి వెళ్లిపోతా అని అమ్మ చెప్పింది. బైక్ నడపొద్దని నా దగ్గర మాట తీసుకుందని యువీ ఇటీవల వెల్లడించాడు. దీంతో యువీ బైక్‌ బదులు కార్లు వాడటం మొదలుపెట్టాడు.

‘నేను కార్లు నడపటాన్ని ఇష్టపడతా. నా దగ్గర మెర్సిడిస్, ఆడి, బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదినప్పుడు రెండు కార్లు బహుమతిగా వచ్చాయి. అమ్మకు మెర్సిడెస్ ఉంది. అదంటే నాకెంతో ఇష్టమని’ యువరాజ్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -