Monday, May 6, 2024
- Advertisement -

స‌చిన్‌కు తొలిసారి బ్యాట్‌ను ఇచ్చింది ఎవ‌రు….

- Advertisement -
Who given bat first time to Sachin Tendulkar

క్రికెట్ రంగంలో రారాజు ఎవ‌రంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్ క‌ర్‌. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే .ఎంత పెద్ద క్రికెటరైనా తాను కొట్టిన సిక్సుల సంఖ్య ఎంతన్నది మర్చిపోతాడేమో కానీ తొలిసారి బ్యాట్‌ పట్టుకున్న రోజుని మాత్రం మర్చిపోలేడు.

అందుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ మినహాయింపు కాదు. లిటిల్‌ మాస్టర్‌ జీవితాధారంగా ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స‌చిన్‌జీవితంలో జ‌రిగిన ఎన్నో సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు రానున్నాయి.
ఈ సందర్భంగా సినిమా నిర్మాత రవి భాగ్‌చంద్కా సచిన్‌ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సచిన్‌కి తొలి బ్యాట్‌ను అతని సోదరిసవిత కానుకగా ఇచ్చారట. అది కూడా ఈ బ్యాట్‌ని ప్రత్యేకంగా కశ్మీర్‌నుంచి తయారుచేయించింది కావటం విశేషం. ఈ విషయాల్ని సచిన్‌ తనతో చెప్పినట్లుగా రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సచినే స్వయంగానటించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రికెట్‌లో రికార్డులు సృష్టించిన్ ఆయ‌న న‌టించిన సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -