Saturday, May 4, 2024
- Advertisement -

యుద్ధ‌రంగంలోకి ఉత్త‌ర‌కొరియా దిగుతోందా……?

- Advertisement -
North Korea ready for war..?

ఉత్త‌ర కొరియా దుందుడుకు చ‌ర్య‌ల‌తో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ముదురు తున్నాయి. త‌మ మీద దాడిచేసె ఏదేశంమీద నైనా అణ్వాయుధాలు ప్ర‌యేగిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఆమెరికా దాని మిత్ర‌దేశాలు భ‌య‌ప‌డుతున్నాయి.

ఉత్త‌ర కొరియా మిత్ర‌దేశాలైన చైనా,ర‌ష్యా ఎంత చెప్పినా వినిపించుకోవ‌పోడంతో యుద్ధం త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.
ప్ర‌తీసారి అణ్వ‌స్త్రాలు ప్ర‌యేగిస్తామని ప్ర‌క‌టించ‌డంతో అదేశం వ‌ద్ద అణ్వ‌స్త్రాలు ఉన్నాయా… ఉంటె అన్నంత ప‌నిచేస్తుందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన అణ్వస్త్రాలు ఉండడమే కాకుండా ఆ దేశ నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అన్నంత పనిచేసే దుందుడుకు స్వభావి అవడం కూడా భయానికి కారణం అవుతుంది.
ఉత్త‌ర‌కొరియా 2006, 2009, 2012 సంవత్సరాల్లో వరుసగా అణ్వస్త్ర ప్రయోగాలు నిర్వహించింది. ఒక్క 2016లోనే రెండోసార్లు అణ్వస్త్ర ప్రయోగాలను నిర్వహించింది. అంతేకాకుండా హైడ్రోజన్‌ బాంబును కూడా విజయవంతంగా ప్రయోగించి చూసింది. సుదూర లక్ష్యాలను ఛేదించే ఖండాంతర క్షిపణలు కలిగిన ఈ దేశం వద్ద అపార సైనిక శక్తి ఉంది. వరుసగా దక్షిణ కొరియాతో యుద్ధాలు జరుగుతుండడం వల్ల ఈ దేశం అపార సైనిక సంపత్తిని సమకూర్చుకుంది.
ఉత్తర కొరియా ముప్పు ఎక్కువ‌గా ఆస్ట్రేలియా, ద‌క్షిణ‌కొరియా జ‌పాన్‌దేశాల‌కు పొంచి ఉంది. ఆ దేశం బెదిరింపులను మా ప్రభుత్వం మాత్రం తీవ్రంగానే పరిగణిస్తోంది’ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బుల్‌ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాతో అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం పూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇటీవల తన ఓవల్‌ ఆఫీసు నుంచి రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉత్తర కొరియా అన్నంత పనిచేస్తుందన్నది వీరిద్దరి మాటల్లో వ్యక్తం అవుతోంది. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడి మాట‌లు చూస్తె యుధ్దం త‌ప్పేటట్టు లేద‌న్న భావ‌న‌లు అంత‌ర్జాతీయంగా వినిపిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}Pzf62hXRNQ0{/youtube}

Also Read

  1. పాక్‌పై మండిప‌డ్డ‌ ఉత్త‌ర కొరియా….
  2. ఉత్త‌ర కొరియా దుందుడ‌కుతో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తం…..
  3. ఉత్త‌ర కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు
  4. ఏక్ష‌ణ‌మైనా యుధ్దం.. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్తితులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -