Monday, April 29, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే….

- Advertisement -

త్వ‌ర‌లో ఇంగ్లండ్ వేదిక జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్‌కు 15 మందితో కూడిన జ‌ట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. ఈ జట్టులో సీనియర్‌ ఆటగాళ్లు జోష్‌ హజల్‌వుడ్‌, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్‌స్కోంబ్‌లకు చోటు దక్కలేదు. దీంతో అలెక్స్‌ కారె వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. బాల్ ట్యాంప‌రింగ్ కార‌ణంగా ఏడాది పాటు క్రికెట్‌ నుంచి నిషేధానికి గురికావడం తెలిసిందే. ఇటీవల వీరిపై నిషేధం ముగిసింది. దీంతో జ‌ట్టు మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, డ్యాషింగ్‌ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆరోన్ ఫించ్ జ‌ట్టుకు సార‌ధ్యం వ‌హించ‌నున్నాడు.

తుది జట్టు:
ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డేవిడ్‌వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కారె(వికెట్‌ కీపర్‌), ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, రిచర్డ్సన్‌, జాసన్‌ బెహండ్రాఫ్‌, ఆడమ్‌ జంపా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -