Tuesday, May 6, 2025
- Advertisement -

న్యూజిలాండ్‌తో మ్యాచ్ ర‌ద్దు అయినా ఫైన‌ల్‌కు ఇండియానె….కాక‌పోతె…?

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌కు రంగం సిద్దం అయ్యింది. రేపు మాంచెస్ట‌ర్ట్‌లో మొద‌టి సెమీఫైన‌ల్ ఇండియా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ప్రారంభం కానుంది. మొద‌టినుంచి ఈ ప్ర‌పంచ‌క‌ప్‌కు వ‌ర‌ణుడి అడ్డు త‌గులుతానె ఉన్నాడు. ఇప్ప‌టికే లీగ్ ద‌శ‌లో కొన్ని మ్యాచ్‌లు కూడా ర‌ద్దు అయ్యాయి. తాజాగా సెమీఫైన్‌ల‌కు కూడా వ‌ర‌ణుడు ప‌గ‌బ‌ట్టాడు.రేపు మాంచెస్టర్‌లో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించవచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ చెబుతోంది. రేపు మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒక వేల వ‌ర్షం కురిసి మ్యాచ్ ర‌ద్దు అయితే దానికి రిజ‌ర్వ్‌డే ఉంది. ఈ క్రమంలో రేపు వర్షం కారణంగా ఆటను కొనసాగించలేకపోతే.. బుధవారం రోజున అక్కడి నుంచే ఆటను ప్రారంభిస్తారు. అయితే రేపటి కన్నా బుధవారమే ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రిజ‌ర్వ్‌డే రోజునె భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం పొంచి ఉంది.ఈ క్రమంలో వరుసగా రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ ర‌ద్దు అయినా భార‌త్‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమి లేదు. అది టీమిండియాకె లాభం.లీగ్ దశలో అధిక పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఈ లెక్కన చూస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో భారత్‌కు అధిక పాయింట్లు (15) ఉన్నాయి కనుక.. టీమిండియానే ఫైనల్‌కు వెళ్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -