వన్డే ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఖాతా తెరచింది ఆస్ట్రేలియా. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 215 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (52), ఇంగ్లిస్ (58) హాఫ్ సెంచరీలతో రాణించగా లబుషేన్ (40), మ్యాక్స్‌వెల్ (31 ) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషనక 3 వికెట్లు పడగొట్టాడు.
ఇక అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ఓ దశలో 125/0 తో ఉన్న శ్రీలంక తర్వాత వరుస వికెట్లు కొల్పోయి భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. పాథుమ్ నిషాంక (61), కుషాల్ పెరెరా (78) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. జాంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఐదుసార్లు ప్రపంచకప్ విజేత అయిన ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పేలవ ప్రదర్శన కనబర్చింది. అయితే మూడో మ్యాచ్‌లో శ్రీలంకతో విజయం సాధించగా లంక వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.