Wednesday, May 1, 2024
- Advertisement -

టీమిండియా కెప్టెన్‌గా సూర్య..టీమ్ ఇదే

- Advertisement -

వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీమిండియా తన తొలి సిరీస్‌ను ఆసీస్‌తోనే ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్న బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. వాస్తవానికి హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి ఉన్న గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సూర్యకు ఈ ఛాన్స్ దక్కింది. సూర్యను కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక చివరి రెండు టీ20లకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులోకి రానుండగా శ్రేయస్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.

సీనియర్ ఆటగాళ్లైన రోహిత్‌, విరాట్‌, కెఎల్‌ రాహుల్, శుభ్‌మన్‌ గిల్‌, జస్ప్రిత్‌బుమ్రా, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు విశ్రాంతినివ్వనున్నారు. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ,ఆవేశ్ ఖాన్,ముఖేష్ కుమార్,రవి బిష్ణోయ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

సంజు శాంసన్,షాబాద్ అహ్మద్‌లకు నిరాశే ఎదురుకాగా అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్‌లకు ఆల్ రౌండర్ జాబితాలో చోటు దక్కింది. తొలి సారిగా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు సూర్య. ఇక ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక నవంబర్ 23న విశాఖ వేదికగా తొలి టీ20,26న రెండో టీ20,28న మూడో టీ20,డిసెంబర్ 1న నాలుగో టీ20,డిసెంబర్ 3న ఐదో టీ20 జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -