Monday, April 29, 2024
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌..కూర్పు కష్టమేనా?

- Advertisement -

టీ 20 వరల్డ్ కప్ 2024కి సర్వం సిద్ధమైంది. జూన్ నుండి టీ20 సమరం ప్రారంభంకానుండగా ఈసారి టీమిండియా తుదిజట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు తలకు మించిన భారమే కానుంది. ఎందుకంటే సీనియర్లకు ధీటుగా జూనియర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు.

జట్టులో ఓపెనింగ్ స్ధానం నుండి 7వ నెంబర్ బ్యాట్స్‌మెన్ వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ప్లేస్ కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఓపెనర్లలో మొదటి స్థానానికి రోహిత్ శర్మ సెట్ అయిన రెండో ఓపెనర్ స్థానానికి జైస్వాల్, గిల్, గైక్వాడ్, ఇషాన్ కిషన్ గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా జైస్వాల్, గైక్వాడ్ టీ20 స్పెషలిస్ట్‌లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మిడిలార్డర్ బెర్త్ కోసం విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, కే‌ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శాంసన్, రింకూ సింగ్, జితేష్ పోటీ పడుతుండగా ఆల్‌రౌండర్ల విభాగంలో ఆరుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. హర్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా, శివం దూబే, శార్దూల్, సుందర్ తో పాటు కుల్దీప్, బిష్ణోయ్, చహల్,బుమ్రా, ముఖేష్, సిరాజ్, షమి, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, చాహర్, ప్రసిద్ద్ కృష్ణ ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉంది.మొత్తంగా వీరిలో టాప్ 11లో చోటు దక్కించుకునేది ఎవరనేది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -