అక్టోబర్ 5 నుండి వరల్డ్ కప్ భారత్ వేదికగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో ఒకటి దక్షిణాఫ్రికా.199,2011,2015లో నాకౌట్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా ప్రపంచకప్ గెలిచే వరకు వెళ్లినా అదృష్టం కలిసిరాకపోవడంతో ఓటమి తప్పలేదు. అయితే 2019లో చెత్త ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది.
అయితే ఈ సారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది దక్షిణాఫ్రికా. ఈ జట్టులోని ఆటగాళ్లకు ఐపీఎల్ రూపంలో భారత్ పిచ్‌లపై అవగాహన ఉండటం, కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో అంతా సమిష్టిగా రాణిస్తే కప్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ కీలక ఆటగాళ్లు. వీరిద్దరూ రాణిస్తే ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలే. క్లాసెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గెరాల్డ్ కోయెట్జీ తన పేస్ తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పెట్టగలడు. ఇక క్వింటన్ డి కాక్ కు ఇదే చివరి ప్రపంచకప్ . టీ20ల్లో మాత్రమే ఆడతానని ప్రపంచకప్ ప్రారంభానికి ముందే వెల్లడించాడు. డికాక్ ఫామ్‌లోకి వస్తే పరుగుల వరదపారడం ఖాయం.
15 మంది ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురు సభ్యులు 32 ఏళ్లు పైబడిన వారే. టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ కు ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా జట్టు?
టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్ (వారం), రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, లుంగీ ఎంగిడి, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డుస్సెంస్, లిజా వాన్ డెర్ డుస్సెంస్.
