Monday, May 20, 2024
- Advertisement -

TDP:పాదయాత్రా..?బస్సుయాత్రా..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్, త్వరలో నారా లోకేష్‌ అరెస్ట్ కూడా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఫైబర్ నెట్ స్కాంలో లోకేష్‌కు ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు అందజేయగా అక్టోబర్ 4 వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని సూచించింది న్యాయస్ధానం.

ఈ నేపథ్యంలో టీడీపీ పెద్ద దిక్కులా మారారు నారా భువనేశ్వరి, బ్రాహ్మణీ. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రి క్యాంపు నుండి టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్న వీరిద్దరు త్వరలో ప్రజా కార్యచరణను చేపట్టనున్నారు.

ఓ వైపు బ్రాహ్మణీ పాదయాత్ర చేస్తే మరోవైపు భువనేశ్వరి బస్సుయాత్ర ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. లేదా ఇద్దరు కలిసి పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నారా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుందని తెలుస్తోంది.

ఈ యాత్ర పది రోజులపాటు జరిపేలా ప్లాన్ చేస్తున్నారు.చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టలేదు భువనేశ్వరి. అయితే ఒక్కసారిగా ఆమె రాజకీయాల్లోకి రావల్సిన సందర్భం రావడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ ఉన్నా..ఆమె ప్రసంగాలు ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటాయి అన్నది సందిగ్దమే. ఎందుకంటే రాజకీయంగా అనుభవం లేదు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే సబ్జెక్ట్ లేదు…ఈ నేపథ్యంలో వైసీపీని ఏ విధంగా ఎదుర్కొంటారు అన్నది ప్రశ్నార్థకమేనని పలువురు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -