డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరల్డ్ కప్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని నిరాశ పర్చింది. వరుసగా నాలుగో ఓటమితో ఇంటిముఖం పట్టింది. టాప్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ ఉన్నా ఇంగ్లాండ్ ఇంత చెత్త ప్రదర్శన ఎప్పుడూ కనబర్చలేదు. దీంతో మాజీ ఆటగాళ్లంతా ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటివరకూ 5 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో నెగ్గింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్రపంచ కప్ నుండి వైదొలగడం ఖాయమే.
ఇంగ్లాండ్ జట్టుకు దిశానిర్దేశం కూడా లేకుండా పోయిందని…టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్ కోల్పోవడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆ దేశ మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు.
శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
2007 నుంచి ఇప్పటివరకు మెగా టోర్నీలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోలేదు శ్రీలంక. వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌ను వరుసగా 5వ సారి ఓడించింది. అఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్టే ఇంగ్లాండ్‌ను చిత్తు చేయడంతోనే ఆ జట్టు ప్రదర్శనపై ఆశలు సన్నగిల్లాయి. ఇక తన తర్వాతి మ్యాచ్ 29న భారత్‌తో తలపడనుంది ఇంగ్లాండ్.